త్రివిక్రమ్ తో నవీన్ పొలిశెట్టి..!

September 15, 2021


img

లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో ఏదో ఒక చిన్న పాత్రలో కనిపించి మహేష్ 1 నేనొక్కడినేలో కూడా ఒక చిన్న పాత్రలో అలరించిన నవీన్ పొలిశెట్టి తను లీడ్ రోల్ గా చేసిన ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సూపర్ హిట్ అవడంతో అతనికి పాపులారిటీ పెరిగింది. ఇక ఈ ఇయర్ మొదట్లో వచ్చిన జాతిరత్నాలు సినిమాతో మరో సూపర్ హిట్ అందుకున్నాడు నవీన్ పొలిశెట్టి. జాతిరత్నాలు అతనికి మంచి మైలేజ్ ఇచ్చింది. అందుకే వరుస క్రేజీ సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే ఒకటి రెండు సినిమాలు డిస్కషన్ స్టేజ్ లో ఉండగా లేటెస్ట్ గా మరో సినిమా కన్ ఫర్మ్ చేశాడు నవీన్ పొలిశెట్టి. ఈసారి త్రివిక్రం తో సినిమా చేస్తున్నాడు నవీన్ పొలిశెట్టి.

త్రివిక్రం తన ప్రొడక్షన్ ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్ నిర్మిస్తున్న సినిమాలో నవీన్ పొలిశెట్టి నటిస్తున్నాడు. ఈ సినిమాను నూతన దర్శకుడు కళ్యాణ్ శంకర్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ కూడా నిర్మాణంలో భాగమవుతున్నట్టు తెలుస్తుంది. నిర్మాతగా త్రివిక్రం చేస్తున్న ఈ సినిమాలో నవీన్ ను సెలెక్ట్ చేయడం అతనికి ఇంతకన్నా లక్కీ ఛాన్స్ మరొకటి ఉండదని చెప్పొచ్చు.


Related Post

సినిమా స‌మీక్ష