ప్రముఖ నటుడు ఉత్తేజ్ ఇంట్లో విషాదం..!

September 13, 2021


img

ప్రముఖ నటుడు ఉత్తేజ్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఉత్తేజ్ సతీమణి పద్మావతి సోమవారం ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న ఆమె హైదరాబాద్ బసవతారకం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. అయితే పరిస్థితి విషమించడంతో డాక్టర్లు ఎంత ప్రయత్నించినా ఆమెని కాపాడాలేకపోయారు. ఉత్తేజ్ స్థాపించిన ఫిల్మ్ ఇన్స్ టిట్యూట్ అడ్మినిస్ట్రేషన్ మొత్తం పద్మావతి దగ్గర ఉండి చూసుకునేవారు. క్యాన్సర్ కారణంగా ఆమె కొన్నాళ్లుగా ట్రీట్ మెంట్ పొందుతున్నా లాభం లేకుండా పోయింది.


తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నటుడిగా, రైటర్ గా ఉత్తేజ్ అందరికి సుపరిచితుడే. ఉత్తేజ్ భార్య మరణ వార్త విన్న సినీ ప్రముఖులు ఆయన్ను కలిసి ఓదార్చారు. మెగాస్టార్ చిరంజీవి, ప్రకాశ్ రాజ్, బ్రహ్మాజి వంటి వారు బసవతారకం హాస్పిటల్ లోనే ఉత్తేజ్ ను కలిసేందుకు వెళ్లారు.Related Post

సినిమా స‌మీక్ష