నాగ చైతన్య లవ్ స్టోరీ ట్రైలర్ టాక్..!

September 13, 2021


img

శేఖర్ కమ్ముల డైరక్షన్ లో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన సినిమా లవ్ స్టోరీ. ఏసియన్ సినిమాస్ బ్యానర్ లో సునీల్ నారంగ్ ఈ మూవీ నిర్మించారు. కొన్నాళ్లుగా రిలీజ్ కన్ ఫ్యూజన్ లో ఉన్న ఈ సినిమాను ఫైనల్ గా సెప్టెంబర్ 24న రిలీజ్ ఫిక్స్ చేశారు. ఈ క్రమంలో లవ్ స్టోరీ సినిమా ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు చిత్రయూనిట్. 

లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా వస్తుందని ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది. మరోసారి శేఖర్ కమ్ముల మార్క్ ఎమోషనల్ టచ్ ఈ సినిమా అందిస్తుందని చెప్పొచ్చు. ఇక సినిమాలో నాగ చైతన్య, సాయి పల్లవిల జోడీ హైలెట్ గా నిపిచేలా ఉంది. మ్యూజిక్, సినిమాటోగ్రఫీ అన్ని సినిమాకు ప్లస్ అవనున్నాయి. మరి సెప్టెంబర్ 24న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

Related Post

సినిమా స‌మీక్ష