లవ్ స్టోరీ రిలీజ్ డేట్ ఎనౌన్స్..!

September 10, 2021


img

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల డైరక్షన్ లో వస్తున్న సినిమా లవ్ స్టోరీ. ఈ సినిమాను ఏసియన్ సినిమాస్ బ్యానర్ లో సునీల్ నారంగ్ నిర్మించారు. ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో కన్ ఫ్యూజన్ కొనసాగుతుంది. ఏప్రిల్ 16న రిలీజ్ అనుకున్న ఈ సినిమా కరోనా సెకండ్ వేవ్ తర్వాత సెప్టెంబర్ 10న రిలీజ్ ఫిక్స్ చేశారు. కాని అనుకున్న డేట్ కు కూడా రాలేదు. ఫైనల్ గా లవ్ స్టోరీ సినిమాను సెప్టెంబర్ 24న రిలీజ్ ఫిక్స్ చేశారు మేకర్స్. 

సెప్టెంబర్ 24న థియేటర్లలోనే ఈ సినిమా వస్తుందని చెప్పారు చిత్రయూనిట్. శేఖర్ కమ్ముల మార్క్ ఫీల్ గుడ్ మూవీగా ఇది ఉంటుందని అంటున్నారు. సినిమాలో సాంగ్స్ ఇప్పటికే సూపర్ హిట్ కాగా వాటి వల్ల సినిమాపై మరింత క్రేజ్ పెరిగింది. మజిలీ, వెంకీ మామ సినిమాలతో హిట్ అందుకున్న నాగ చైతన్య లవ్ స్టోరీతో హ్యాట్రిక్ హిట్ అందుకుంటాడో లేదో చూడాలి.Related Post

సినిమా స‌మీక్ష