శ్రీదేవి సోడా సెంటర్ : రివ్యూ

August 27, 2021


img

సుధీర్ బాబు, ఆనంది జంటగా పలాస ఫేమ్ కరుణ కుమార్ డైరక్షన్ లో తెరకెక్కిన సినిమా శ్రీదేవి సోడా సెంటర్. 70 MM ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.

కథ :

అమలాపురం దగ్గర్లో విలేజ్ లో ఉండే లైటింగ్ సూరి బాబు (సుధీర్ బాబు) ఆ చుట్టుపక్కల లైటింగ్ పెట్టాలన్నా, డీజే పెట్టాలన్నా అతన్నే పిలుస్తారు. ఊళ్లో జాతర సందర్భంగా లైటింగ్ కాంట్రాక్ట్ కుదుర్చుకుంటాడు సూరి బాబు. ఈ క్రమంలో శ్రీదేవిని చూసి ఇష్టపడతాడు. శ్రీదేవి కూడా సూరి బాబుని ప్రేమిస్తుంది. కులం పట్టింపు బాగా ఉన్న శ్రీదేవి ఫాదర్ సంజీవ రావు (నరేష్) సూరి బాబుని, శ్రీదేవిని విడతీస్తాడు. ఊరి పెద్దగా ఉంటున్న కాశీ (పావుల్ నవగీతం) కూడా సూరి బాబు మీద పగ పెంచుకుంటాడు. జాతరలో గొడవ వల్ల సూరి బాబుని పోలీసులు అరెస్ట్ చేస్తారు. కేసు కొట్టేస్తారనుకునే టైం లో సూరి బాబుని మళ్లీ కస్టడీలోకి పంపుతారు. సూరి బాబు, శ్రీదేవిల ప్రేమ కథ ఎలాంటి మలుపులు తిరిగింది..? వారి ప్రేమ గెలిచిందా లేదా అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.    

విశ్లేషణ :

పలాస సినిమాతో మెప్పించిన కరుణ కుమార్ ఆ సినిమా తరహాలోనే శ్రీదేవి సోడా సెంటర్ సినిమాను తెరకెక్కించాడు. ఎంచుకున్న కథా నేపథ్యం బాగానే ఉన్నా కులం, పరువు లాంటి నేపథ్యంతో చాలా సినిమాలు వచ్చాయి కాబట్టి సినిమా అంతా తెలిసిన కథగా అనిపిస్తుంది. శ్రీదేవి సోడా సెంటర్ కూడా వాటితో పోల్చే అవకాశం ఉంటుంది. సినిమా మొత్తం గోదావరి జిల్లా నేపథ్యంలో నడుస్తుంది.

శ్రీదేవి సోడా సెంటర్ సినిమా క్లైమాక్స్ మాత్రం చాలా కొత్తగా చేశారు. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమా క్లైమాక్స్ రాసుకున్నారు. క్లైమాక్స్ ఎపిసోడ్ మొత్తం సినిమాకు హైలెట్ గా నిలుస్తాయని చెప్పొచ్చు. ఆ ఎపిసోడ్ డైలాగ్స్ కూడా ఆకట్టుకున్నాయి.

కరుణ కుమార్ తన మొదటి సినిమా తరహాలోనే శ్రీదేవి సోడా సెంటర్ ను కూడా రియలిస్టిక్ గా తెరకెక్కించడంలో సక్సెస్ అయ్యాడు. అయితే కొన్ని సీన్స్ ప్రేక్షకులకు చేరువేయడంలో మాత్రం తడపడ్డారని అనిపిస్తుంది. ఓవరాల్ గా సినిమా చూసిన ఆడియెన్స్ లైటింగ్ సూరి బాబు, సోడాల శ్రీదేవిలతో ప్రేమలో పడతారు.

నటన, సాంకేతిక వర్గం :

సినిమాలో సూరి బాబు పాత్రలో సుధీర్ బాబు అదరగొట్టాడు. సినిమా సినిమాకు తన రేంజ్ పెంచుకుంటూ వెళ్తున్న సుధీర్ బాబు. నటుడిగా పరిణితి చెందుతున్నాడని చెప్పొచ్చు. శ్రీదేవ్ సోడా సెంటర్ సినిమాలో సూరి బాబు పాత్రలో ఇంటెన్స్ లుక్ తో ఆకట్టుకున్నాడు. క్లైమాక్స్ లో సుధీర్ బాబు నటన నెక్స్ట్ లెవల్ లో ఉంటుంది. ఇక హీరోయిన్ ఆనంది కూడా శ్రీదేవి పాత్రకు పర్ఫెక్ట్ గా సూట్ అయ్యింది. ఆనంది కూడా తన పాత్రకు 100 పర్సెంట్ న్యాయం చేసింది. సీనియర్ యాక్టర్ నరేష్ కూడా సినిమాలో మంచి పాత్రలో మెప్పించారు. క్లైమాక్స్ లో ఆయన పాత్ర కూడా సర్ ప్రైజ్ చేస్తుంది. హీరో ఫ్రెండ్ పాత్రలో నటించిన సత్యం రాజేష్ తన నటనతో మెప్పించాడు. ఇక విలన్ గా చేసిన పావుల్ నవగీతం కూడా పాత్రకు న్యాయం చేశాడు. సినిమాలో మిగతా పాత్రలన్ని ఆకట్టుకున్నాయి. 

శ్రీదేవి సోడా సెంటర్ టెక్నికల్ టీం విషయానికి వస్తే.. శ్యాం దత్ కెమెరా పనితనం బాగుంది. మణిశర్మ మ్యూజిక్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. సినిమాకు మేజర్ హైలెట్స్ లో మణిశర్మ మ్యూజిక్ ఒకటి. సాంగ్స్ తో పాటుగా తన మార్క్ మ్యూజిక్ తో మణిశర్మ ఆకట్టుకున్నారు. 70 ఎం.ఎం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి ఎక్కడ కాంప్రమైజ్ అవకుండా ఈ సినిమా నిర్మించారు. 

ఒక్కమాటలో :

శ్రీదేవి సోడా సెంటర్.. మెప్పించిన సూరి బాబు, శ్రీదేవిల ప్రేమ కథ..!

రేటింగ్ : 3/5


Related Post

సినిమా స‌మీక్ష