ఆగష్టు 13న 'పుష్ప' ఫస్ట్ సాంగ్..!

August 02, 2021


img

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న పుష్ప సినిమా నుండి ఫస్ట్ సాంగ్ ఆగష్టు 13న వస్తుంది. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. దేవి బర్త్ డే సందర్భమా పుష్ప ఫస్ట్ సాంగ్ అప్డేట్ ఇచ్చారు. ఆగష్టు 13న పుష్ప ఫస్ట్ సాంగ్ దాక్కో దాక్కో మేక సాంగ్ రిలీజ్ చేస్తారని ఎనౌన్స్ చేశారు. అసలైతే అన్ని అనుకున్నట్టుగా జరిగితే పుష్ప సినిమా ఆగష్టు 13కి రిలీజ్ అవ్వాల్సింది కాని సినిమాకు బదులు సినిమాలోని ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేస్తున్నారు. పాన్ ఇండియా సినిమా కాబట్టి ఆర్.ఆర్.ఆర్ దోస్తీ తరహాలోనే ఐదుగురు సింగర్స్ తో.. ఐదు భాషల్లో ఈ సాంగ్ రిలీజ్ చేస్తున్నారు.

మొత్తానికి ఆర్.ఆర్.ఆర్ బాటలో పుష్ప కూడా సినిమాపై అంచనాలు పెంచేస్తుంది. సుకుమార్, దేవి, అల్లు అర్జున్ ఈ ముగ్గురి కాంబినేషన్ లో సినిమా మ్యూజిక్ పరంగా కూడా దుమ్ముదులిపేయడం ఖాయమని చెప్పొచ్చు. మరి ఈ సినిమాలోని ఫస్ట్ సాంగ్ శాంపిల్ అదిరిపోగా ఫుల్ సాంగ్ ఎలా ఉంటుందో చూడాలి.

Related Post

సినిమా స‌మీక్ష