వెంకీతో రవితేజ..!

August 02, 2021


img

టైటిల్ చూసి కచ్చితంగా విక్టరీ వెంకటేష్ తో మాస్ మహ రాజ్ రవితేజ మల్టీస్టారర్ చేస్తున్నాడని అనుకోవచ్చు. ఇక్కడ వెంకీ అంటే మన వెంకీ మామ కాదు డైరక్టర్ వెంకీ కుడుముల. ఛలో, భీష్మ సినిమాలతో సక్సెస్ అందుకున్న వెంకీ కుడుముల తన నెక్స్ట్ సినిమా మెగా హీరోలతో చేయాలని ప్రయత్నించినా వర్క్ అవుట్ కాలేదు. ఫైనల్ గా రవితేజతో వెంకీ సినిమా ఫిక్స్ అయినట్టు టాక్.

వెంకీ కుడుముల కామెడీ టైమింగ్ కు రవితేజ లాంటి హీరో దొరికితే ఆడియెన్స్ కు మరో సూపర్ ఎంటర్టైనింగ్ మూవీ వచ్చినట్టే. ఈ క్రేజీ కాంబో దాదాపు ఫిక్స్ అని ఇండస్ట్రీ టాక్. త్వరలోనే ఈ సినిమాకు సంబందించిన అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వస్తుందని అంటున్నారు. రవితేజ ప్రస్తుతం ఖిలాడి సినిమా పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఈ సినిమాతో పాటుగా శరత్ మండవ డైరక్షన్ లో రామారావు ఆన్ డ్యూటీ సినిమా కూడా లైన్ లో ఉంది.Related Post

సినిమా స‌మీక్ష