అక్కినేనిని తొలగించిన సమంత.. ఎందుకని..?

July 31, 2021


img

ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వస్తున్న సమంత సడెన్ గా తన కొత్త అప్డేట్ తో ఫ్యాన్స్ ను కన్ఫ్యూజన్ లో పడేసింది. ఒక్కసారిగా తన సోషల్ మీడియా హ్యాండిల్ నేమ్ ని మార్చి అందరికి షాక్ ఇచ్చింది సమంత. నాగ చైతన్యతో పెళ్లి జరిగిన దగ్గర నుండి అక్కినేని సమంతగా ఉన్న తన సోషల్ మీడియా హ్యాండిల్స్ పేరు జస్ట్ S అని పెట్టి ఆడియెన్స్ కు షాక్ ఇచ్చింది ముద్దుగుమ్మ. ఇంతకీ అసలు సమంత పేరెందుకు మార్చాల్సి వచ్చింది అన్న విషయం మీద మాత్రం క్లారిటీ రాలేదు.        

ఇక సమంత అలా పేరు మార్చిందో లేదో నాగ చైతన్యతో ఆమె వివాహ బంధం ఎండ్ కార్డ్ పడిందా అంటూ రకరకాల వార్తలు పుట్టిస్తున్నారు. నాగ చైతన్య, సమంత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2017 అక్టోబర్ లో వీరి మ్యారేజ్ జరిగింది. నాలుగేళ్లుగా ఏ సమస్య లేకుండా కలిసి ఉంటున్న ఈ జంటకు ఇప్పుడు ఏమైంది అంటూ వార్తలు వస్తున్నాయి. మరి సమంత పేరు మార్చడం వెనక అసలు మ్యాటర్ ఏంటన్నది వాస్త్వవాలు బయటకు రావాల్సి ఉంది.Related Post

సినిమా స‌మీక్ష