చిరు మల్టీస్టారర్ సినిమా..?

July 31, 2021


img

ఆచార్య తర్వాత మెగాస్టార్ చిరంజీవి వరుసగా రెండు సినిమాలను ఒకేసారి సెట్స్ మీదకు తీసుకెళ్లాలని చూస్తున్నారు. లూసిఫర్ రీమేక్ గా మోహన్ రాజా డైరక్షన్ లో సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ సినిమాతో పాటుగా కె.ఎస్ రవీంద్ర డైరక్షన్ లో మూవీ కూడా ఫిక్స్ చేసుకున్నారి చిరు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తారని తెలుస్తుంది. కె.ఎస్ రవీంద్ర సినిమాలో చిరు డ్యుయల్ రోల్ చేస్తాడని కొన్నాళ్లుగా వార్తలు రాగా ఇప్పుడు సినిమాలో చిరు డ్యుయల్ రోల్ కాదు సినిమాలో మరో హీరో నటిస్తాడని అంటున్నారు.

డైరక్టర్ రవీంద్ర చిరుతో మల్టీస్టారర్ సినిమా ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తుంది. ఇంతకీ చిరంజీవితో కలిసి చేసే ఆ స్టార్ హీరో ఎవరన్నది మాత్రం తెలియలేదు. ఈ సినిమాకు సంబందించిన మిగతా డీటైల్స్ త్వరలో వెల్లడిస్తారని తెలుస్తుంది. ఆచార్యలో ఆల్రెడీ చరణ్ తో కలిసి చేస్తున్న చిరంజీవి కె.ఎస్ రవీంద్ర సినిమాలో కూడా మరో హీరోతో కలిసి పనిచేస్తారని తెలుస్తుంది.Related Post

సినిమా స‌మీక్ష