వకీల్ సాబ్ టీ.ఆర్.పి రికార్డ్..!

July 21, 2021


img

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ వెండితెర మీదే కాదు బుల్లితెర మీద కూడా రికార్డులు సృష్టించింది. వేణు శ్రీరాం డైరక్షన్ లో దిల్ రాజు నిర్మించిన వకీల్ సాబ్ సినిమా జూలై 18న వరల్డ్ టీవీ ప్రీమియర్ గా జీ తెలుగులో టెలికాస్ట్ అయ్యింది. స్మాల్ స్క్రీన్ పై వకీల్ సాబ్ సందడి బాగుందని చెప్పొచ్చు. ఈ సినిమా టీ.ఆర్.పి రేటింగ్స్ లో రికార్డులు బద్ధలు కొట్టింది. మొన్నటి వరకు అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమా పేరు మీద ఉన్న రికార్డ్ ను ఇప్పుడు వకీల్ సాబ్ తన పేరు మీద రాసుకున్నాడు. 

అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమా బుల్లితెర మీద 29.4 రేటింగ్ తెచ్చుకుంది. వకీల్ సాబ్ ఆ రికార్డ్ బ్రేక్ చేస్తూ 32.20 టీ.ఆర్.పి రేటింగ్ తెచ్చుకుంది. అంతకుముందున్న అన్ని రికార్డులన్ని అల వైకుంఠపురములో బ్రేక్ చేయగా ఆ రికార్డ్ బ్రేక్ చేసి సరికొత్త సంచలనం సృష్టించాడు వకీల్ సాబ్. Related Post

సినిమా స‌మీక్ష