వెండితెర మీదే రానా 'విరాటపర్వం'..!

July 21, 2021


img

దగ్గుబాటి వారసుడు రానా హీరోగా వేణు ఊడుగుల డైరక్షన్ లో వస్తున్న సినిమా విరాటపర్వం. 1990లో జరిగిన యధార్ధ సంఘటన ఆధారంగా నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా వస్తుంది. టీజర్ తోనే సినిమాపై అంచనాలు పెంచిన డైరక్టర్ వేణు ఊడుగుల సినిమాను అంతకుమించి అనిపించేలా తెరకెక్కించాడని తెలుస్తుంది. ఇక ఈ సినిమాను ఓటీటీ రిలీజ్ చేస్తారని ఈమధ్య టాక్ వచ్చింది. సురేష్ ప్రొడక్షన్స్ లో వస్తున్న ఈ సినిమా కూడా ఓటీటీ బాట పడుతుందని అనుకున్నారు. రానా సినిమా ఎక్కడ రిలీజ్ చేయాలి అన్న దాని మీద నిర్మాత సురేష్ బాబు కూడా ఓ కన్ ఫర్మేషన్ కు రాలేదు.

ఇక ఇదిలాఉంటే విరాటపర్వం ఓటీటీ రిలీజ్ పై స్పందించారు డైరక్టర్ వేణు. సినిమా ఎట్టిపరిస్థితుల్లో థియేటర్లోనే రిలీజ్ చేస్తామని అన్నారు. విరాటపర్వం సినిమాకు ఓటీటీల నుండి ఫ్యాన్సీ ఆఫర్లు వచ్చినా సినిమాను థియేటర్ లోనే రిలీజ్ చేయాలని దర్శక నిర్మాతలు నిర్ణయించుకున్నారు. ఈ సినిమాలో రానాకి జోడీగా సాయి పల్లవి నటించింది. ఎలాగు ప్రస్తుతం థియేటర్లు తెరచుకునేందుకు ప్రభుత్వాలు పర్మిషన్ ఇస్తున్నాయి కాబట్టి విరాటపర్వం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు.Related Post

సినిమా స‌మీక్ష