చైతుతో తరుణ్ భాస్కర్..!

July 19, 2021


img

పెళ్లిచూపులు, ఈనగరానికి ఏమైంది సినిమాలతో డైరక్టర్ గా తన సత్తా చాటిన తరుణ్ భాస్కర్ తన డైరక్షన్ లో అక్కినేన్ హీరో నాగ చైతన్యతో సినిమా ఫిక్స్ చేసుకున్నాడని తెలుస్తుంది. సురేష్ బాబు నిర్మాణంలో ఈ సినిమా వస్తుందని టాక్. అసలైతే వెంకటేష్ తో తరుణ్ భాస్కర్ మూవీ ఉంటుందని కొన్నాళ్లుగా డిస్కషన్స్ నడుస్తున్నాయి. వెంకీ సినిమా ఇంకా టైం పట్టేలా ఉందని తరుణ్ భాస్కర్ చైతు కోసం ఓ కథ రాసుకున్నాడట స్టోరీ నచ్చడంతో సినిమా ఓకే అయినట్టు తెలుస్తుంది.

మామతో కాదని అల్లుడుతో సినిమా చేస్తున్నాడు తరుణ్ భాస్కర్. తెలుగులో టాలెంటెడ్ డైరక్టర్స్ లో ఒకరైన తరుణ్ భాస్కర్ తన సినిమాలతో యూత్ ఆడియెన్స్ ను అలరిస్తున్నారు. మరి చైతుతో సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి. సురేష్ ప్రొడక్షన్స్ లో సురేష్ బాబు నిర్మిస్తున్నారు అంటే తరుణ్ భాస్కర్ మంచి కథతోనే వస్తున్నారని చెప్పొచ్చు.Related Post

సినిమా స‌మీక్ష