హను రాఘవపుడితో అఖిల్..!

July 19, 2021


img

అక్కినేని అఖిల్, పూజా హెగ్దే నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ రిలీజ్ కు రెడీగా ఉంది. చాలా గ్యాప్ తర్వాత బొమ్మరిల్లు భాస్కర్ ఈ సినిమా డైరెక్ట్ చేశారు. ఇక ఈ సినిమా తర్వాత సురేందర్ రెడ్డి డైరక్షన్ లో ఏజెంట్ సినిమా చేస్తున్నాడు అఖిల్. ఈ సినిమా మాస్ ఎంటర్టైనర్ గా వస్తుందని తెలుస్తుంది. సినిమా కోసం అఖిల్ సిక్స్ ప్యాక్ లుక్ తో సర్ ప్రైజ్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత అఖిల్ మరో లవ్ స్టోరీతో వస్తాడని తెలుస్తుంది. హను రాఘవపుడి డైరక్షన్ లో ఈ సినిమా ఉంటుందని టాక్.

సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ఈ సినిమా నిర్మిస్తుందని తెలుస్తుంది. సితార బ్యానర్ లో సినిమా అంటే మినిమం గ్యారెంటీ అన్నట్టే. అఖిల్ ఆరవ సినిమా ఈ బ్యానర్ లో వస్తుంది. హను రాఘవపుడి, అఖిల్ ఈ క్రేజీ కాంబో ఎలాంటి సినిమాతో వస్తారో చూడాలి. అఖిల్ ఈసారి లవ్ స్టోరీతో యూత్ ఆడియెన్స్ టార్గెట్ తో బరిలో దిగాలని చూస్తున్నాడు. 


Related Post

సినిమా స‌మీక్ష