హనుమాన్ లో జయమ్మ..!

June 19, 2021


img

కోలీవుడ్ భామ వరలక్ష్మి శరత్ కుమార్ కు టాలీవుడ్ బాగా కలిసి వచ్చిందని చెప్పొచ్చు. సందీప్ కిషన్ తెనాలి రామకృష్ణ సినిమాతో తెలుగులో నటించిన వరలక్ష్మి ఆ తర్వాత రవితేజ క్రాక్ సినిమాలో జయమ్మ పాత్రలో అదరగొట్టింది. ఆ సినిమా హిట్ అవడంతో ఆమెకు వరుస అవకాశాలు వస్తున్నట్టు తెలుస్తుంది. అల్లరి నరేష్ నాంది సినిమాలో కూడా ఆమె మంచి రోల్ లో నటించింది. ప్రస్తుతం గోపీచంద్ మలినేని బాలకృష్ణతో చేస్తున్న సినిమాలో కూడా వరలక్ష్మికి ఓ మంచి పాత్ర ఇచ్చినట్టు తెలుస్తుంది.

ఇదేకాకుండా టాలెంటెడ్ డైరక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేస్తున్న హనుమాన్ మూవీలో కూడా వరలక్ష్మికి ఛాన్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అ!, కల్కి, జాంబి రెడ్డి సినిమాలతో డైరక్టర్ గా తనకంటూ ఒక మార్క్ ఏర్పరచుకున్న ప్రశాంత్ వర్మ తన నెక్స్ట్ సినిమాను ఓ సూపర్ హ్యూమన్ కథతో వస్తున్నాడు. ఈ సినిమాలో కూడా తేజా సజ్జ లీడ్ రోల్ లో నటిస్తాడని తెలుస్తుంది. సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ కు ఇంపార్టెంట్ రోల్ ఇచ్చారట. తెలుగులో ఆమె బిజీ ఆర్టిస్ట్ గా మారబోతుందని చెప్పొచ్చు. Related Post

సినిమా స‌మీక్ష