థియేటర్లోనే పాగల్..!

June 19, 2021


img

విశ్వక్ సేన్ హీరోగా సిమ్రన్ చౌదరి, నివేదా పేతురాజ్ హీరోయిన్స్ గా నటిస్తున్న సినిమా పాగల్. నరేష్ కుప్పిలి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను బెల్లం వేణు గోపాల్ నిర్మిస్తుండగా సినిమాకు రధన్ మ్యూజిక్ అందిస్తున్నారు. టీజర్ తో మెప్పించిన ఈ పాగల్ రిలీజ్ కు రెడీగా ఉంది. అయితే ఈ సినిమాను ఓటిటి రిలీజ్ చేస్తారని వార్తలు రాగా చిత్రయూనిట్ స్పందించింది. థియేటర్ లోనే పాగల్ రిలీజ్ అవుతుందని అన్నారు. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో జూన్ 20 ఆదివారం నుండి తెలంగాణాలో లాక్ డౌన్ ఎత్తేస్తున్నారు. 

థియేటర్లు కూడా తెరచుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. థియేటర్ లు తెరవగానే ముందు వరుసలో పాగల్ రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. రిలీజైన టీజర్ మాత్రమే కాదు సాంగ్స్ కూడా సినిమాపై అంచనాలు పెంచాయి. హిట్ తర్వాత పాగల్ గా వస్తున్న విశ్వక్ సేన్ ఆశించిన స్థాయిలో అంచనాలను అందుకుంటాడో లేదో చూడాలి.Related Post

సినిమా స‌మీక్ష