డియర్ కామ్రేడ్ హిందీ వర్షన్ సూపర్ హిట్..!

June 18, 2021


img

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కాంబినేషన్ లో వచ్చిన సినిమా డియర్ కామ్రేడ్. గీతా గోవిందం తర్వాత ఈ ఇద్దరు కలిసి నటించిన ఈ సినిమాపై అంచనలు భారీగా ఏర్పడ్డాయి. అయితే ఆ అంచనాలను అందుకోవడంలో మాత్రం సినిమా ఫెయిల్ అయ్యింది. భరత్ కమ్మ డైరక్షన్ లో వచ్చిన ఈఎ సినిమా తెలుగులో ప్రేక్షకాదరణ లభించలేదు కాని ఈ సినిమా హిందీ వర్షన్ మాత్రం 250 మిలియన్ వ్యూస్ సాధించింది.

తెలుగు సినిమాలకు హిందీలో భారీ డిమాండ్ ఉంటుంది. డియర్ కామ్రేడ్ హిందీ డబ్బింగ్ వర్షన్ సినిమా యూట్యూబ్ లో 25 కోట్ల వ్యూస్ రాబట్టింది. సినిమా హిందీ వర్షన్ యూట్యూబ్ లో రిలీజై ఏడాది కూడా అవ్వలేదు ఆలోగానే డియర్ కామ్రేడ్ మూవీ అంతమంది హిందీ ఆడియెన్స్ ను మెప్పించింది. తెలుగు సినిమా హిందీ డబ్బింగ్ వర్షన్ వ్యూస్ తో సృష్టించిన రికార్డుల్లో డియర్ కామ్రేడ్ కూడా ఒకటని చెప్పొచ్చు.   

 


Related Post

సినిమా స‌మీక్ష