రాజ రాజ చోర టీజర్.. శ్రీవిష్ణు అలరించాడు..!

June 18, 2021


img

శ్రీవిష్ణు హీరోగా హషిత్ గోలి డైరక్షన్ లో వస్తున్న సినిమా రాజ రాజ చోర. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో టీజీ విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్ కొద్దిగంటల క్రితం రిలీజైంది. సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ అని చెబుతూ చోర కళ చూపించే మన హీరో అనుకోకుండా ఓ రిస్క్ లో పడతాడు. ఇదే కథాంశంతో రాజ రాజ చోర సినిమా వస్తుంది. సినిమా టీజర్ ఆసక్తికరంగా ఉంది. ముఖ్యంగా టీజర్ లో వివేజ్ సాగర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సూపర్ అనిపించింది.

గాలి సంపత్ తో టార్గెట్ మిస్ అయిన శ్రీవిష్ణు రాజ రాజ చోర సినిమాతో పక్కా హిట్ కొట్టేలా ఉన్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా తమిళ భామ మేఘా ఆకాష్ నటిస్తుంది. సినిమాలో మరో భామ సునైనా కూడా నటిస్తుందని తెలుస్తుంది. శ్రీవిష్ణు చేస్తున్న ఈ ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. 

Related Post

సినిమా స‌మీక్ష