శేఖర్ కమ్ములతో ధనుష్..!

June 17, 2021


img

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ డైరెక్ట్ తెలుగు సినిమా చేస్తాడని తెలుస్తుంది. తెలుగులో సెన్సిబుల్ డైరక్టర్ గా పేరు తెచ్చుకున్న శేఖర్ కమ్ముల డైరక్షన్ లో ధనుష్ హీరోగా సినిమా ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమాను ఏషియన్ సినిమాస్ సునీల్ నారంగ్ నిర్మిస్తారని తెలుస్తుంది. సినిమాకు సంబందించిన కథా చర్చలు ఇప్పటికే పూర్తయ్యాయని సమాచారం. తమిళంలో వరుస హిట్లతో దూసుకెళ్తున్న ధనుష్ తెలుగులో చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉంటాయి. 

ప్రస్తుతం శేఖర్ కమ్ముల నాగ చైతన్యతో లవ్ స్టోరీ సినిమా చేస్తున్నాడు. ఇన్నాళ్లు యువ హీరోలతో సినిమా చేస్తూ వచ్చిన శేఖర్ కమ్ముల కెరియర్ లో మొదటిసారి స్టార్ హీరోని డైరెక్ట్ చేయబోతున్నారు. ఈ ప్రాజెక్ట్ కు సంబందించిన డీటైల్స్ బయటకు రావాల్సి ఉంది.



Related Post

సినిమా స‌మీక్ష