చరణ్ కథతో వరుణ్ తేజ్..?

June 17, 2021


img

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం ఎఫ్3తో పాటుగా గని సినిమా చేస్తున్నాడు. ఎఫ్2 సూపర్ హిట్ అవడంతో అదే కాంబినేషన్ లో ఈసారి మరింత నవ్వించడానికి వస్తున్నారు. ఇక బాక్సింగ్ నేపథ్యంలో నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి డైరక్షన్ లో గని సినిమా చేస్తున్నాడు వరుణ్ తేజ్. ఈ రెండు సినిమాల తర్వాత వరుణ్ తేజ్ సక్సెస్ ఫుల్ డైరక్టర్ వెంకీ కుడుములతో సినిమా చేస్తాడని అంటున్నారు. ఛలో, భీష్మ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్లు అందుకున్న వెంకీ కుడుముల తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను మెగా హీరోతో చేస్తున్నాడని తెలుస్తుంది.

అసలైతే వెంకీ కుడుముల ముందు ఈ కథను రాం చరణ్ కు వినిపించాడట. కథ నచ్చినా ఆర్.ఆర్.ఆర్ తర్వాత ఇలాంటి సినిమా కష్టమని వరుణ్ తేజ్ దగ్గరకు ఈ కథ పంపించాడడట. వరుణ్ తేజ్ కు కథ నచ్చి ప్రాజెక్ట్ ఓకే చేసినట్టు తెలుస్తుంది. ఛలో, భీష్మ తరహాలోనే కామెడీ ఎంటర్టైనర్ కథతోనే స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో వెంకీ కుడుముల ఈ సినిమా చేస్తున్నాడని తెలుస్తుంది. ఈ సినిమాకు సంబందించిన మిగతా విషయాలు త్వరలో తెలుస్తాయి.



Related Post

సినిమా స‌మీక్ష