10 KGF లతో సమానమట..!

June 15, 2021


img

సుకుమార్, అల్లు అర్జున్ కాంబో అనగానే సినిమా అంచనాలు తారాస్థాయిలో ఉంటాయి. అల వైకుంఠపురములో హిట్ జోష్ లో అల్లు అర్జున్.. రంగస్థలం లాంటి ఇండస్ట్రీ హిట్ కొట్టిన సుకుమార్ సూపర్ ఫాం లో ఉండగా ఈ ఇద్దరు కలిసి చేస్తున్న పుష్ప మీద ఎక్కడలేని అంచనాలు ఏర్పడ్డాయి. మొన్నటిదాకా ఒక పార్ట్ గా అనుకున్న ఈ సినిమా రెండు పార్టులుగా వస్తుందని తెలుస్తుంది. ఈ సినిమా గురించి వస్తున్న ప్రతి వార్త మెగా, అల్లు ఫ్యాన్స్ ను అలరిస్తుంది. సినిమాలో బోట్ ఫైట్ హైలెట్ గా ఉంటుందని ఇప్పటికే వార్తలు వస్తుండగా సినిమాను చూసిన ఉప్పెన డైరక్టర్ బుచ్చి బాబు పుష్ప సినిమా 10 కే.జి.ఎఫ్ లతో సమానమని చెప్పి మరింత హైప్ తెచ్చాడు.

అల్లు అర్జున్ ఊర మాస్ అవతార్ మాస్ ఆడియెన్స్ ను అలరిస్తుందని చెబుతున్నారు. పుష్ప రాజ్ పాత్రలో బన్నీ తన నట విశ్వరూపం చూపించాడని తెలుస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న పుష్ప సినిమా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అవుతుంది. సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు.



Related Post

సినిమా స‌మీక్ష