RRR షూటింగ్ కు టైం ఫిక్స్..!

June 15, 2021


img

రాజమౌళి డైరక్షన్ లో వస్తున్న RRR సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్ కు రెడీ అవుతుంది. కరోనా సెకండ్ వేవ్ ఉదృతి వల్ల ఇన్నాళ్లు షూటింగ్ వాయిదా పడతా ప్రస్తుతం పరిస్థితి కొద్దిగా అదుపులోకి వచ్చినట్టే అనిపిస్తుంది. త్వరలోనే సినిమా షూటింగ్స్ కు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో ఆర్.ఆర్.ఆర్ టీం కూడా చివరి షెడ్యూల్ కు రంగం సిద్ధం చేసింది. జూలై మొదటి వారంలో ఈ షెడ్యూల్ మొదలవుతుందని తెలుస్తుంది. ఆర్ వారాల పాటు కంటిన్యూగా ఈ షెడ్యూల్ కొనసాగిస్తారని తెలుస్తుంది.

ఈ షెడ్యూల్ లో సినిమాకు సంబందించిన ఇంపార్టెంట్ సన్నివేశాలు షూట్ చేస్తారని తెలుస్తుంది. ఇప్పటికే సినిమాలోని మేజర్ పార్ట్ అంతా షూటింగ్ పూర్తి చేయగా సినిమాలో కొన్ని కీలల సన్నివేశాలు ఈ షెడ్యూల్ లో పూర్తి చేస్తారని తెలుస్తుంది. ముఖ్యంగా సినిమాలో అలియా భట్ సీన్స్ ఈ షెడ్యూల్ లో పూర్తి చేస్తారని టాక్. సినిమాలో కొమరం భీం పాత్రలో ఎన్.టి.ఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో రాం చరణ్ నటిస్తున్నారు.  



Related Post

సినిమా స‌మీక్ష