పూరీ మరో బాలీవుడ్ ఛాన్స్..!

June 09, 2021


img

డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరక్టర్ పూరీ జగన్నాథ్ ప్రస్తుతం విజయ్ దేవరకొండతో లైగర్ సినిమా చేస్తున్నాడు. తెలుగుతో పాటుగా తమిళ, కన్నడ, మళయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. పూరీ మార్క్ మాస్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రాబోతుంది. ఈ సినిమాతో అర్జున్ రెడ్డి హీరో విజయ్ దేవరకొండ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఇదిలాఉంటే పూరీ జగన్నాథ్ కు మరో బాలీవుడ్ ఆఫర్ వచ్చిందని తెలుస్తుంది. లైగర్ హిందీ వర్షన్ రిలీజ్ చేస్తున్న కరణ్ జోహార్ పూరీతో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారట.

లైగర్ తర్వాత పూరీ కరణ్ కాంబినేషన్ లో ఓ సినిమా ఉంటుందని తెలుస్తుంది. అయితే పూరీ ఆ సినిమా కూడా లైగర్ లా పాన్ ఇండియా మూవీగా చేస్తాడా లేక బాలీవుడ్ హీరోని పెట్టి అక్కడే రిలీజ్ చేస్తాడా అన్నది తెలియాల్సి ఉంది. లైగర్ హిట్ పడితే పూరీకి బాలీవుడ్ లో డిమాండ్ పెరిగే ఛాన్స్ ఉంది.  Related Post

సినిమా స‌మీక్ష