మరోసారి ఫిదా కాంబో..!

May 17, 2021


img

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం F3, గని సినిమాల్లో నటిస్తున్నాడు. ఈ సినిమాల తర్వాత వరుణ్ తేజ్ సక్సెస్ ఫుల్ డైరక్టర్ వెంకీ కుడుముల డైరక్షన్ లో సినిమా చేస్తాడని తెలుస్తుంది. ఛలో, భీష్మ సినిమాలతో సూపర్ హిట్ అందుకున్న వెంకీ కుడుముల తన నెక్స్ట్ సినిమాకు క్రేజీ ప్లాన్ చేశాడు. సూపర్ హిట్ కాంబోని రిపీట్ చేస్తూ వెంకీ తన మార్క్ మ్యాజిక్ చేయాలని చూస్తున్నాడు. వరుణ్ తేజ్ తో ఓ స్పోర్ట్స్ డ్రామా మూవీకి ప్లాన్ చేశాడట వెంకీ కుడుముల.   

ఈ సినిమాలో హీరోయిన్ గా సాయి పల్లవిని సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఫిదా మూవీలో నటించిన జోడీ మళ్లీ రిపీట్ అవుతుంది. వరుణ్ తేజ్, సాయి పల్లవి ఇద్దరి జోడీకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. మళ్ళీ ఆ ఇద్దరు కలిసి సినిమా చేస్తున్నారు. సాయి పల్లవి కూడా సెలెక్టివ్ సినిమాలు చేస్తూ అలరిస్తుంది. నాగ చైతన్యతో లవ్ స్టోరీ, రానాతో చేసిన విరాటపర్వం సినిమాలు రిలీజ్ కు రెడీగా ఉన్నాయి. వీటితో పాటుగా మరో రెండు సినిమాలకు సైన్ చేసిందట సాయి పల్లవి.Related Post

సినిమా స‌మీక్ష