సర్కారు వారి పాట హైలెట్ అదేనా..!

May 06, 2021


img

సూపర్ స్టార్ మహేష్, పరశురాం కాంబినేషన్ లో వస్తున్న క్రేజీ మూవీ సర్కారు వారి పాట. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. సినిమా ఒక షెడ్యూల్ దుబాయ్ లో పూర్తి చేసుకుంది. అయితే సినిమాలో హైలెట్ సీన్స్ లో దుబాయ్ ఫైట్ సీన్ అని అంటున్నారు.

దుబాయ్ లో జరిగిన ఫైట్ సీన్ బాగా వచ్చిందని సినిమా హైలెట్ గా చెప్పుకునే అంశాల్లో అది ఒకటని చెబుతున్నారు. 2022 సంక్రాంతికి సినిమా రిలీజ్ ప్లాన్ చేశారు. అయితే ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ వల్ల సినిమా షూటింగ్ కు బ్రేక్ ఇచ్చారు. ఈ సినిమాతో పాటుగా త్వరలోనే త్రివిక్రం డైరక్షన్ లో మహేష్ సినిమా ఉంటుందని తెలుస్తుంది. అతడు, ఖలేజా తర్వాత హ్యాట్రిక్ మూవీగా త్రివిక్రం, మహేష్ సినిమా రాబోతుంది.Related Post

సినిమా స‌మీక్ష