బాలయ్య కోసం ఇద్దరు..!

May 06, 2021


img

బోయపాటి శ్రీను డైరక్షన్ లో అఖండ సినిమా చేస్తున్న బాలకృష్ణ తన నెక్స్ట్ సినిమా క్రాక్ డైరక్టర్ గోపీచంద్ మలినేనితో ఫిక్స్ చేసుకున్న విషయం తెలిసిందే. బాలకృష్ణతో ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథతో గోపీచంద్ సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఈ సినిమాను కూడా క్రాక్ సినిమాలో వాడుకున్న వేటపాలెం నేపథ్యం వాడుతున్నట్టు తెలుస్తుంది. ఇక సినిమాలో హీరోయిన్స్ గా ఒకరు కాదు ఇద్దరు భామలు ఉంటారని తెలుస్తుంది.

మాస్ అండ్ కమర్షియల్ సినిమాలతో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న గోపీచంద్ మలినేని బాలయ్య కోసం పవర్ ఫుల్ స్టోరీ సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. ఇక కథకు తగినట్టుగా ఇద్దరు హీరోయిన్స్ ను సెలెక్ట్ చేశారట. అయితే బాలయ్య సరసన నటించే ఆ ఇద్దరు హీరోయిన్స్ ఎవరన్నది మాత్రం ఇంకా వెల్లడించలేదు. 



Related Post

సినిమా స‌మీక్ష