సందీప్ కిషన్ గొప్ప మనసు.. అడవి శేష్ మంచి 'నీటి' సాయం..!

May 04, 2021


img

కరోనా క్రైసిస్ టైం లో సినీ హీరోలు తమకు తోచిన సహాయాన్ని చేసేందుకు ముందుకొస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ తీవ్రత బాగా ఉండటంతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను చూసి సినీ తారలు కూడా తమ సహాయాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే సందీప్ కిషన్ ఓ గొప్ప కార్యానికి శ్రీకారం చుట్టారు. కరోనా వల్ల తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు తాను అండగా ఉంటానని చెపాడు. రెండేళ్లు వారిని చూసుకునేందుకు తను ముందుకొచ్చాడు. తన టీం తో సాధ్యమైనంత వరకు ఈ సహాయక కార్యక్రమాలు చేస్తామని అన్నారు.     


కరోనా వల్ల పేరెంట్స్ ను కోల్పోయిన చిన్నారుల డీటైల్స్ sundeepkishancovidhelp@gmail.com మెయిల్ ఐడికి  పంపించాలని సందీప్ కిషన్ చెప్పారు. ఇక సందీప్ కిషన్ బాటలోనే యువ హీరో అడివి శేష్ కరోనా టైం లో హైదరాబాద్ కోఠి ప్రభుత్వ హాస్పిటల్ లో మంచి నీరుని అందిస్తున్నారు. 300 మంది కరోనా పేషెంట్స్ చికిత్స పొందుతున్న కోఠి ప్రభుత్వ హాస్పిటల్ లో తాగునీటి సమస్య ఏర్పడింది. ఈ విషయం సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న అడివి శేష్ వెంటనే రంగంలోకి దిగి ఆ హాస్పిటల్ కు 850 లీటర్ల వాటర్ బాటిల్స్ ను పంపించారు. వైద్య సిబ్బంది కూడా వాటర్ లేక డీహైడ్రేషన్ కు గురవుతున్నారని తెలుసుకుని మంచి నీటి ఏర్పాటు చేశారు అడివి శేష్. అంతేకాదు ప్రస్తుతానికే కాకుండా శాశ్వతంగ వాటర్ సప్లై కోసం తాను సహకరిస్తానని హామీ ఇచ్చారు అడివి శేష్. కరోనా సమయంలో బాధితులను ఆదుకునేందుకు తెలుగు సినీ తారలు చేస్తున్న ఈ పనులు అభినందనీయం అని చెప్పొచ్చు. 
Related Post

సినిమా స‌మీక్ష