సలార్ లో కె.జి.ఎఫ్ బ్యూటీ..!

May 03, 2021


img

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఆల్రెడీ రాధే శ్యాం చివరి దశలో ఉండగా సలార్, ఆదిపురుష్ సినిమాలు లైన్ లో ఉన్నాయి. సలార్ సినిమా ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో వస్తున్న విషయం తెలిసిందే. కె.జి.ఎఫ్ 2 రిలీజ్ అవగానే ప్రశాంత్ నీల్ సలార్ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్తారని తెలుస్తుంది. ఆల్రెడీ సలార్ కోసం ఒక షెడ్యూల్ ను పూర్తి చేశారు చిత్రయూనిట్. ఈ సినిమా కె.జి.ఎఫ్ నిర్మాతలు నిర్మిస్తున్నారు.

సినిమాలో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమాలో శృతి హాసన్ తో పాటుగా కె.జి.ఎఫ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టి కూడా నటిస్తుందని తెలుస్తుంది. సినిమాలో అమ్మడు ఓ స్పెషల్ సాంగ్ చేస్తుందని తెలుస్తుంది. కె.జి.ఎఫ్ సినిమాతో సౌత్ లో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న శ్రీనిధి శెట్టి సలార్ లో కూడా భాగమవుతుందని తెలుస్తుంది. సలార్ సినిమాను 2022 ఏప్రిల్ 14న రిలీజ్ ప్లాన్ చేశారు. రాధే శ్యాం ఈ ఇయర్ జూలై 30న రిలీజ్ అంటున్నారు. అయితే ప్రస్తుతం సినిమాలన్ని వాయిదా బాట పడుతుండగా ప్రభాస్ రాధే శ్యాం అనుకున్న టైం కు వస్తుందన్న గ్యారెంటీ అయితే లేదని చెప్పొచ్చు.Related Post

సినిమా స‌మీక్ష