ట్రిపుల్ రోల్ లో నందమూరి హీరో..!

May 02, 2021


img

నందమూరి హీరో కళ్యాణ్ రాం సరైన హిట్ సినిమా కథ కోసం వేట కొనసాగిస్తూనే ఉన్నాడు. పటాస్ తర్వాత మళ్లీ హిట్ సినిమాకు దూరమైన కళ్యాణ్ రామ్ ఒకేసారి రెండు సినిమాలను సెట్స్ మీదకు తీసుకెళ్తున్నాడని తెలుస్తుంది. అందులో ఒకటి నూతన దర్శకుడు రాజేంద్ర డైరక్షన్ లో ఉంటుందని తెలుస్తుంది. డైరక్టర్ చెప్పిన కథ బాగా నచ్చి కళ్యాణ్ రామ్ సినిమా ఓకే చేసినట్టు తెలుస్తుంది. ఈ సినిమాను ఓ బడా బ్యానర్ నిర్మిస్తుందని తెలుస్తుంది.

ఈ సినిమాలో మరో స్పెషల్ థింగ్ ఏంటంటే సినిమాలో కళ్యాణ్ రామ్ ట్రిపుల్ రోల్ చేస్తాడని తెలుస్తుంది. కళ్యాణ్ రామ్ త్రిపాత్రాభినయమా అని కొద్దిగా షాక్ అవ్వొచ్చు. కథ డిమాండ్ చేస్తే ఎవరు ఎన్ని పాత్రలైనా వేయొచ్చు. ఆల్రెడీ ఎన్.టి.ఆర్ జై లవ కుశ సినిమాలో ట్రిపుల్ రోల్ చేసి మెప్పించారు. ఇప్పుడు కళ్యాణ్ రామ్ మూడు పాత్రల్లో కనిపించి అలరించాలని చూస్తున్నారు. కళ్యాణ్ రామ్ చేస్తున్న ఈ ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.Related Post

సినిమా స‌మీక్ష