ఆన్ లైన్ పాఠాలు నేర్చుకుంటున్న నాగార్జున..!

April 20, 2021


img

రీసెంట్ గా వైల్డ్ డాగ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగార్జున తన నెక్స్ట్ సినిమా ప్రవీణ్ సత్తారు డైరక్షన్ లో సినిమా వస్తున్న విషయం తెలిసిందే. యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా కోసం నాగార్జున మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్నారట. సీనియర్ హీరో.. 60 ఏళ్లు పై బడినా సరే యువ హీరోలకు తాను ఏమాత్రం తక్కువ కాదని ప్రూవ్ చేసుకుంటున్నారు నాగార్జున.

ప్రవీణ్ సత్తారు సినిమా కోసం నాగార్జున మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ తీసుకుంటున్నారట. అయితే ఈ ట్రైనింగ్ అంతా ఆన్ లైన్ లో జరుగుతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం కరోనా తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల నాగార్జున మార్షల్ ఆర్ట్స్ ను ఆన్ లైన్ లో నేర్చుకుంటున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో నాగార్జున చాలా కొత్తగా కనిపిస్తారని తెలుస్తుంది. సినిమాలో ఇలియానా హీరోయిన్ గా నటిస్తుందని టాక్.Related Post

సినిమా స‌మీక్ష