మెగా హీరోతో మైత్రి మేకర్స్ సూపర్ డీల్..!

April 19, 2021


img

మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన మొదటి సినిమా ఉప్పెన సూపర్ డూపర్ హిట్ అయ్యింది. బుచ్చి బాబు డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాతో కృతి శెట్టి తెలుగు తెరకు పరిచయమైంది. ఈ సినిమాతో ఆమెకు కూడా సూపర్ క్రేజ్ దక్కింది. ఉప్పెన రిలీజ్ అవకుండానే క్రిష్ డైరక్షన్ లో సినిమా పూర్తి చేశాడు వైష్ణవ్ తేజ్. ఈమధ్యనే గిరీశయ్య డైరక్షన్ లో సినిమా స్టార్ట్ చేశాడు.

ఈ సినిమాలే కాకుండా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో రెండు సినిమాలకు భారీ డీల్ సెట్ చేసుకున్నాడట వైష్ణవ్ తేజ్. తనకు మొదటి అవకాశం ఇచ్చిన బ్యానర్ కాబట్టి ఆ సెంటిమెంట్ తో మైత్రి మూవీ మేకర్స్ కు రెండు సినిమాలకు సైన్ చేశాడట వైష్ణవ్ తేజ్. మత్రి మూవీ మేకర్స్ కూడా వైష్ణవ్ తేజ్ భారీ ప్లానింగ్ సినిమాలే చేస్తున్నట్టు తెలుస్తుంది.Related Post

సినిమా స‌మీక్ష