మెగాస్టార్ తో వంశీ పైడిపల్లి..?

April 19, 2021


img

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమా చేస్తున్నారు. అసలైతే మే 13న రిలీజ్ అనుకున్న ఈ సినిమా వయిదా వేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత మోహన్ రాజా డైరక్షన్ లో లూసిఫర్ రీమేక్ గా ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే వాటితో పాటుగా కె.ఎస్ రవీంద్ర డైరక్షన్ లో ఒక సినిమా.. మెహెరర్ రమేష్ డైరక్షన్ లో మరో సినిమా చిరు చేస్తారని తెలుస్తుంది. అయితే చిరంజీవి సినిమాల లిస్ట్ లో మరో డైరక్టర్ కూడా చేరినట్టు తెలుస్తుంది.

మహర్షి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న వంశీ పైడిపల్లి ఆ తర్వాత సినిమా కూడా మహేష్ తో చేయాలని అనుకున్నా ఎందుకో కుదరలేదు. ఆ తర్వాత ప్రభాస్, రాం చరణ్ లతో సినిమా చేయాలని ట్రై చేసిన వంశీకి అవి కుదరలేదు. ఫైనల్ గా వంశీ పైడిపల్లి మెగాస్టార్ చిరంజీవికి ఓ కథ చెప్పాడట. లైన్ బాగుండటంతో చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాక్. ఫుల్ స్క్రిప్ట్ ఓకే అయితే చిరు, వంశీ పైడిపల్లి కాంబినేషన్ సినిమా పక్కా అని అంటున్నారు.Related Post

సినిమా స‌మీక్ష