క్రికెటర్ ను మెప్పించిన జాతిరత్నాలు..!

April 17, 2021


img

అనుదీప్ కెవి డైరక్షన్ లో నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, ఫరియా అబ్దుల్లా నటించిన సినిమా జాతిరత్నాలు. తెలుగు ప్రేక్షకులకు లాఫింగ్ థెరపీగా సూపర్ సక్సెస్ అయిన ఈ సినిమాపై క్రికెటర్ దినేష్న్ కార్తీక్ కూడా ప్రశంసలు కురిపించాడు. జాతిరత్నాలు సినిమా చూసి కడుపుబ్బా నవ్వుకున్నానని.. ప్రతి సన్నివేశం తనని నవ్వించిందని అన్నారు దినేష్ కార్తీక్. డైలాగులు అదిరిపోయాయని.. డైరక్షన్ అద్భుతమని అన్నారు. నటీనటులంతా బాగా చేశారని దినేష్ ట్వీట్ చేశాడు. 

తమిళనాడుకి చెందిన దినేష్ కార్తీక్ తెలుగు సినిమాపై తన రివ్యూ చెప్పడం క్రేజీగా మారింది. ఫైనల్ పంచ్ గా కామెడీ జానర్ అన్నిటికంటే కష్టమైందని.. దాన్ని జాతిరత్నాలు అద్భుతంగా పండించిందని.. మీరు ఇలానే ఔట్ స్టాండింగ్ గా ఉండాలని కామెంట్ పెట్టాడు దినేష్ కార్తీక్. జాతిరత్నాలు సినిమాపై దినేష్ చేసిన ట్వీట్ జాతిరత్నాలు సినిమా లవర్స్ ను అలరిస్తుంది. ప్రస్తుతం దినేష్ కార్తీక్ ఐపిఎల్ లో కలకత్తా నైట్ రైడర్స్ టీం లో ఆడుతున్నారు.



Related Post

సినిమా స‌మీక్ష