జాంబి రెడ్డి అక్కడ సూపర్ హిట్..!

April 08, 2021


img

అ! సినిమాతో సత్తా చాటి కల్కితో మెప్పించిన డైరక్టర్ ప్రశాంత్ వర్మ తన థర్డ్ మూవీ జాంబి రెడ్డితో కూడా సర్ ప్రైజ్ హిట్ అందుకున్నాడు. తెలుగులో వచ్చిన మొదటి జాంబి సినిమాగా జాంబి రెడ్డి ప్రేక్షకులను అలరించింది. అంతేకాదు మరోసారి దర్శకుడు ప్రశాంత్ వర్మ ప్రతిభను మెచ్చుకునేలా చేసింది. ఈ సినిమా సిల్వర్ స్క్రీన్ పై హిట్ అవడమే కాకుండా స్మాల్ స్క్రీన్ పై కూడా సత్తా చాటింది. ఇటీవల టెలికాస్ట్ అయిన జాంబి రెడ్డి మూవీ స్టార్ మాలో 9.7 టి.ఆర్.పి రేటింగ్ తెచ్చుకుంది.

జాంబి రెడ్డి సినిమాకు ఈ రేంజ్ రేటింగ్ అంటే బుల్లితెర ఆడియెన్స్ దీనికి హిట్ సర్టిఫికెట్ ఇచ్చేసినట్టే. తొలి తెలుగు జాంబి మూవీగా జాంబి రెడ్డి అటు సిల్వర్ స్క్రీన్ ఇటు స్మాల్ స్క్రీన్ ఆడియెన్స్ ను అలరించింది. జాంబి రెడ్డి హీరో తేజా సజ్జా జాంబి రెడ్డికి వచ్చిన రేటింగ్ ను ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. ప్రశాంత్ వర్మ జాంబి రెడ్డికి సీక్వల్ కూడా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సీక్వల్ లో సమంత నటిస్తుందని టాక్.Related Post

సినిమా స‌మీక్ష