వకీల్ సాబ్ కోసం మెగాస్టార్ వెయిటింగ్..!

April 08, 2021


img

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా కోసం మెగాస్టార్ చిరంజీవి కూడా వెయిట్ చేస్తున్నారని తెలుస్తుంది. ఏప్రిల్ 9 శుక్రవారం రిలీజ్ అవుతున్న వకీల్ సాబ్ సినిమా రిలీజ్ బజ్ చూసిన చిరు పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎక్సయిట్ అయ్యేలా చేశారు. చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా చూడాలని మీ అందరిలానే నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని మెసేజ్ పెట్టారు. ఫ్యామిలీతో కలిసి రేపు సాయంత్రం వకీల్ సాబ్ చూస్తున్నాం అంటూ ట్వీట్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. అంతేకాదు సినిమా చూసి చిరు తన రెస్పాన్స్ తెలియచేస్తానని అన్నారు. అంతేకాదు పవన్ మేకప్ వేసుకుంటున్న టైం లో క్రాఫ్ సరిచేస్తున్న పిక్ ఒకటి షేర్ చేశారు చిరంజీవి.      

చిరు చేసిన ఈ ట్వీట్ పవర్ స్టార్ ఫ్యాన్స్ లో మరింత ఉత్సాహం తెచ్చింది. 3 ఏళ్ల గ్యాప్ తో పవన్ నటించిన వకీల్ సాబ్ సినిమాపై బజ్ ఓ రేంజ్ లో ఉంది. బాలీవుడ్ లో సూపర్ హిట్టైన పింక్ సినిమాను తెలుగులో వేణు శ్రీరాం డైరక్షన్ లో రీమేక్ చేశారు. ఈ సినిమాలో శృతి హాసన్, నివేదా థామస్, అంజలి నటించారు. థమన్ అందించిన మ్యూజిక్ సినిమాకు సూపర్ బజ్ తెచ్చింది. 90 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై సూపర్ బజ్ ఏర్పడింది.  


Related Post

సినిమా స‌మీక్ష