అఖిల్ 5కి నాగ్ టైటిల్..!

April 07, 2021


img

అక్కినేని అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి డైరక్షన్ లో వస్తున్న సినిమా ఫస్ట్ లుక్ టైటిల్ పోస్టర్ ఏప్రిల్ 8న రిలీజ్ ప్లాన్ చేశారు. అయితే ఈ సినిమాకు సంబందించిన టైటిల్ గురించి మీడియాలో ఓ న్యూస్ వైరల్ గా మారింది. అఖిల్ 5వ ప్రాజెక్ట్ గా వస్తున్న ఈ సినిమాకు టైటిల్ గా వారసుడు అని పెడుతున్నారట. కింగ్ నాగార్జున హీరోగా ఇవివి సత్యనారాయణ డైరక్షన్ లో వచ్చిన సినిమా వారసుడు. ఈ సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ కూడా నటించారు. 1993లో వచ్చిన ఈ మూవీ టైటిల్ ను అఖిల్ కోసం వాడేస్తున్నారట.

అక్కినేని నట వారసుడిగా అఖిల్ ఇంతవరకు హిట్ ఖాతా తెరవలేదు. ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ డైరక్షన్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో అఖిల్ సరసన బుట్ట బొమ్మ పూజా హెగ్దే నటిస్తుంది. సినిమాకు పూజా గ్లామర్ స్పెషల్ ఎట్రాక్షన్ గా ఉంటుందని తెలుస్తుంది.  Related Post

సినిమా స‌మీక్ష