వకీల్ సాబ్ సెన్సార్ పూర్తి..!

April 05, 2021


img

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, వేణు శ్రీరాం కాంబినేషన్ లో వస్తున్న సినిమా వకీల్ సాబ్. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ పింక్ రీమేక్ గా వస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 9న రిలీజ్ అవుతుంది. లేటెస్ట్ గా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ వాళ్లు వకీల్ సాబ్ సినిమాకు U/A సర్టిఫికెట్ ఇచ్చారు. సినిమా ట్రైలర్ ఇప్పటికే అంచనాలు పెంచగా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఉత్సాహం చూస్తుంటే సినిమాను బ్లాక్ బస్టర్ చేసేలా ఉన్నారు.   

ఆల్రెడీ సూపర్ హిట్టైన సినిమా కథ కాబట్టి తెలుగులో కూడా అదే తరహా రిజల్ట్ వస్తుందని భావిస్తున్నారు. బాలీవుడ్ లో అమితాబ్, తమిళంలో అజిత్ చేసిన సినిమాలకు భిన్నంగా వకీల్ సాబ్ ఉండబోతుందని తెలుస్తుంది. మూల కథను అలానే ఉంచి పవర్ స్టార్ ఫ్యాన్స్ కోరుకునే కమర్షియల్ అంశాలను జోడించి సినిమా తీశాడు వేణు శ్రీరాం. అంచనాలకు తగినట్టుగానే వకీల్ సాబ్ అదిరిపోతుందా లేదా అన్నది మరో నాలుగు రోజుల్లో తెలుస్తుంది.Related Post

సినిమా స‌మీక్ష