చావు కబురు చల్లగా : రివ్యూ

March 19, 2021


img

ఆరెక్స్ 100 సినిమాతో యూత్ ఆడియెన్స్ లో క్రేజ్ తెచ్చుకున్న కార్తికేయ తన సినిమాలతో మాస్ ఇమేజ్ తెచ్చుకున్నాడు. అయితే వరుస సినిమాలు చేస్తున్నా సరే హిట్ దక్కించుకోలేని ఈ యువ హీరో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ వాసు నిర్మాణంలో చేసిన సినిమా చావు కబురు చల్లగా. ఈ సినిమాను కౌశిక్ డైరెక్ట్ చేశారు. సినిమాలో హీరోయిన్ గా లావణ్యా త్రిపాఠి నటించింది. సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం. 

కథ :

బస్తీ బాలరాజు (కార్తికేయ) వైజాగ్ లో మార్చరీ వ్యాన్ డ్రైవర్ గా పనిచేస్తూ ఉంటాడు. ఓసారి విడో అని లావణ్యని చూసి ప్రేమలో పడతాడు బస్తీ బాలరాజు. ఆమెని చూసి ఇంప్రెస్ అయిన అతను ఆమెను ప్రేమలో దించాలని ప్రయత్నిస్తుంటాడు. అయితే మదర్ తో మాత్రమే ఉంటున్న బాలరాజు తన మదర్ కూడా వేరే ఒకరిని ఇష్టపడుతుందని తెలుసుకుంటాడు. తను ప్రేమించిన మల్లికని బస్తీ బాలరాజు దక్కించుకున్నాడా..? తన తల్లి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు..? అన్నదే సినిమా కథ. 

విశ్లేషణ :

నూతన దర్శకుడు కౌశిక్ సినిమా ప్రమోషన్స్ తో అంచనాలు పెంచి సినిమా చూసే సరికి రొటీన్ కథనే కొత్తగా చెప్పాలని అనుకున్నాడని అనిపిస్తుంది. హీరో, హీరోయిన్ ల మధ్య లవ్ సందర్భం కొత్తగా ఉంటుంది. మాస్ బాలరాజు, విడో మల్లికకు మధ్య లవ్ ఆడియెన్స్ ను కొంతమేర మెప్పిస్తుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం ఎంటర్టైనింగ్ గా హీరో క్యారక్టర్ మీద నడిపించిన డైరక్టర్ ఆ తర్వాత కథను ఎమోషన డ్రామాగా టర్న్ చేసాడు. 

సెకండ్ హాఫ్ కొద్దిగా ల్యాగ్ అయినట్టు ఉంటుంది. అయితే డైరక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో తనకు తాను న్యాయం చేశాడని అనిపిస్తుంది. సినిమా చూసి బాగాలేదు అన్న వారు కన్నా కొత్త క్యారక్టరైజేషన్ తో పాత కథనే మళ్లీ చెప్పారు అన్న టాక్ మాత్రం వస్తుంది. సినిమాలో మిగతా అన్ని అంశాలు సినిమాకు ప్లస్ అయ్యేలా ఉన్నాయని చెప్పొచ్చు. 

నటన, సాంకేతికవర్గం :

కార్తికేయ చాలా ఈజ్ తో బాలరాజు పాత్రని చేశాడు. తనలోని టాలెంట్ మొత్తం ఈ పాత్ర తో చూపించేశాడు. సినిమా మొదలైన కొద్దిసేపటికే ఆ పాత్రకి కనెక్ట్ అవుతారు. ఇక మల్లిక పాత్రలో లావణ్య త్రిపాఠి కూడా ఇంప్రెస్ చేసింది. ఆమని చాలా రోజుల తర్వాత మంచి పాత్రతో మెప్పించారు. ఆమె నాచురల్ నటన ప్రేక్షకులను మెప్పిస్తుంది. మురళి శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్ లు బాగా చేశారు. ఎమోషనల్ సీన్స్ లో కార్తికేయ, ఆమని అదరగొట్టారు. అనసూయ స్పెషల్ సాంగ్ జస్ట్ ఓకే అనిపిస్తుంది.

ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే.. జేక్స్ బిజోయ్ మ్యూజిక్ ఇంప్రెస్ చేసింది. సాంగ్స్ తో పాటుగా బిజిఎం కూడా అలరించింది. కర్మ్ చావ్లా సినిమాటోగ్రఫీ అలరించింది. సినిమాకు కావాల్సిన కలర్, స్క్రీన్ ఆడియెన్స్ కు ఎంగేజ్ అయ్యేలా కెమెరా వర్క్ ఉంది. ఇక డైరక్టర్ కౌశిక్ తన మొదటి సినిమానే మంచి అటెంప్ట్ చేశారని చెప్పొచ్చు. అతని టేకింగ్ స్టైల్ ఫస్ట్ హాఫ్ తో మెప్పిస్తే.. సెకండ్ హాఫ్ తన డైరక్షన్ టాలెంట్ చూపించాడు. ఇక గీతా ఆర్ట్స్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి.

ఒక్కమాటలో :

చావు కబురు చల్లగా.. జస్ట్ టైం పాస్ మూవీ..!

రేటింగ్ : 2.5/5Related Post

సినిమా స‌మీక్ష