శర్వానంద్ బర్త్ డే వేడుకల్లో చరణ్..!

March 06, 2021


img

రామ్ చరణ్ మరియు శర్వానంద్ లు మంచి మిత్రులనే విషయం అందరికి తెలిసిందే. వీరిద్దరు కూడా ఇండస్ట్రీకి రాక ముందు నుండే ఫ్రెండ్స్ అనే విషయం కొద్ది మందికి మాత్రమే తెలుసు. చరణ్ బెస్ట్ ఫ్రెండ్స్ జాబితాలో శర్వా ముందు వరుసలో ఉంటాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. వీరిద్దరు బయటకు ఎక్కువగా కలిసి కనిపించకున్నా కూడా ప్రతి ఒక్క సందర్బంను కూడా ఇద్దరు కలిసి ఎంజాయ్ చేస్తారు అనేది ఇండస్ట్రీ వర్గాల  టాక్. శర్వానంద్ ప్రస్తుతం హీరోగా ఈ స్థాయిలో ఉన్నాడు అంటే ఆయన ప్రతిభతో పాటు కాస్త శర్వానంద్ తో ఉన్న స్నేహం అని కూడా ఇండస్ట్రీ వర్గాల వారు అంటూ ఉంటారు.    

కెరీర్ ఆరంభంలో శర్వానంద్ కు మెగా సపోర్ట్ లభించింది. అందుకే ఈ స్థాయిలో ఆయన సక్సెస్ ఫుల్ హీరోగా దూసుకు పోతున్నాడు. శర్వానంద్ మరియు చరణ్ లు ఎంత బిజీగా ఉన్నా కూడా రెగ్యులర్ గా కలుస్తూనే ఉంటారు. నేడు శర్వానంద్ పుట్టిన రోజు సందర్బంగా చరణ్ స్వయంగా కేక్ కట్ చేయించాడు. చరణ్ చేత్తో కేక్ పట్టుకుని ఉండగా శర్వానంద్ కట్ చేయడంను ఈ ఫొటోలో చూడవచ్చు. చరణ్ మరియు శర్వానంద్ లతో ఈ ఫొటోలో విక్కీ ని కూడా చూడవచ్చు. ఈ ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ గతంలో పలు సందర్బాల్లో వీరి స్నేహం గురించి చర్చ జరిగింది. 

చరణ్ మరియు శర్వానంద్ లు హీరోలుగా బిజీగా ఉండగా విక్కీ వ్యాపారాలతో బిజీగా ఉంటాడు. అయినా కూడా ఈ ముగ్గురు సందర్బానుసారంగా కలుస్తూనే ఉంటారు. మొన్నటి వరకు గోదావరి జిల్లాలో ఆచార్య షూటింగ్ లో పాల్గొన్న చరణ్ నిన్ననే హైదరాబాద్ కు చేరుకున్నాడు. ఆచార్య షూటింగ్ నుండి చరణ్ వచ్చి రాగానే శర్వా బర్త్ డే పార్టీలో పాల్గొన్నాడు. చూస్తుంటే శర్వా బర్త్ డే కోసం చరణ్ ఆచార్య సినిమా షూటింగ్ ను మొన్నే ముగించేసుకుని వచ్చేసినట్లుగా అనిపిస్తుంది.           


Related Post

సినిమా స‌మీక్ష