దృశ్యం-2లో రానా, సమంత..!

March 04, 2021


img

జీతు జోసెఫ్ డైరక్షన్ లో ఆరేళ్ల క్రితం వచ్చిన దృశ్యం సినిమా సూపర్ హిట్ అయ్యింది. మళయాళంలో తెరకెక్కిన ఈ సినిమాను తెలుగులో విక్టరీ వెంకటేష్ రీమేక్ చేశారు. ఇక లేటెస్ట్ గా మళయాళంలో ఈ సినిమా సీక్వల్ తీశారు. దృశ్యం 2 ఈమధ్యనే డైరెక్ట్ ఓటిటి రిలీజై సూపర్ హిట్ అందుకుంది. మళయాళ వర్షన్ హిట్ అవగానే తెలుగులో కూడా ఈ సీక్వల్ రీమేక్ చేస్తునారు.

మాత్రుక దర్శకుడు జీతు జోసెఫ్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. వెంకటేష్, మీనా ప్రధాన పాత్రలుగా నటిస్తున్న ఈ సినిమాలో స్పెషల్ సర్ ప్రైజ్ గా రానా, సమంత కూడా నటిస్తారని అంటున్నారు. సొంత సినిమా కాబట్టి రానా నటించడంలో ఆశ్చర్యపడాల్సింది ఏమి లేదు అయితే సమంత క్రేజ్ ను కూడా ఈ సినిమాకు వాడాలని చూస్తున్నారు సురేష్ బాబు. 

అందుకే దృశ్యం 2లో వెంకటేష్ తో పాటుగా రానా, సమంత కూడా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తారు. వెంకటేష్ ప్రస్తుతం ఎఫ్3, నారప్ప సినిమాలు చేస్తున్నాడు ఈ సినిమాలతో మరోసారి తన సత్తా చాటనున్నారు విక్టరీ వెంకటేష్.


Related Post

సినిమా స‌మీక్ష