ఏనుగుల ఇంట్లో మనుషుల అరాచకం.. అరణ్య ట్రైలర్ అదిరింది..!

March 03, 2021


img

రానా దగ్గుబాటి కేవలం తెలుగులో అది కూడా కమర్షియల్ సినిమాలతోనే సూపర్ క్రేజ్ తెచ్చుకునే ఛాన్స్ ఉన్నా సరే డిఫరెంట్ సినిమాలు చేస్తూ హీరోగానే కాదు విలన్ గా కూడా మెప్పిస్తున్నాడు. బాహుబలి సినిమాలో ప్రభాస్ కు తగిన విలన్ గా భళ్లాలదేవగా రానా అదరగొట్టాడు. ఆ సినిమాకు ముందే హిందీలో సినిమాలు చేసిన రానా లేటెస్ట్ గా అరణ్య అంటూ మరో ప్రయత్నం చేశాడు. ప్రభు సోలమన్ డైరక్షన్ లో వస్తున్న అరణ్య సినిమా మార్చ్ 26న రిలీజ్ ప్లాన్ చేశారు.

ఈ సినిమా ట్రైలర్ లేటెస్ట్ గా రిలీజ్ చేశారు. అటవీ ప్రాంతంలో ఉన్న ఏనుగులను టార్గెట్ చేస్తూ అక్కడ నుండి వాటిని తరిమి కొట్టి అక్కడ తమ స్వలాభం కోసం ప్రాజెక్ట్ చేపట్టాలని చూసే ఫారెస్ట్ మినిస్టర్ ఆలోచనని రానా ఎలా అడ్డుకున్నాడు అన్నది సినిమా కథ. ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించడమే కాకుండా ఇంప్రెస్ చేసింది. ఈ సినిమాలో రానా మిడిల్ ఏజ్ క్యారక్టర్ లో అదరగొట్టాడు. కోలీవుడ్ నటుడు విష్ణు విశాల్ కూడా ఈ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. 





Related Post

సినిమా స‌మీక్ష