Rx 100 హీరోకి అల్లు అర్జున్ గెస్ట్..!

February 26, 2021


img

ఆరెక్స్ 100 సినిమాతో యూత్ ఆడియెన్స్ ను మెప్పించిన కార్తికేయ వరుస సినిమాలైతే చేస్తున్నాడు కాని మళ్ళోసారి ఆరెక్స్ 100 లాంటి హిట్ కొట్టాల్సిన అవసరం ఏర్పడింది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ నూతన దర్శకుడు కౌశిక్ డైరెక్ట్ చేస్తున్న చావు కబురు చల్లగా సినిమాతో వస్తున్నాడు కార్తికేయ. ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తుంది. సినిమా టీజర్ తోనే ఇంప్రెస్ చేయగా రిలీజైన సాంగ్స్ కూడా మెప్పిస్తున్నాయి.

మార్చ్ 19న రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గెస్ట్ గా వస్తారని తెలుస్తుంది. తన సినిమాలకే కాదు ఇతర హీరోల సినిమాలకు బన్నీ ఎప్పుడూ సపోర్ట్ చేస్తూ ఉంటాడు. అలానే కార్తికేయ చావు కబురు చల్లగా సినిమా ఈవెంట్ కు బన్నీ గెస్ట్ గా వస్తున్నారట. కచ్చితంగా బన్నీ ప్రమోట్ చేస్తే సినిమాకు మంచి బూస్టింగ్ ఇచ్చినట్టే.



Related Post

సినిమా స‌మీక్ష