తెల్లవారితే గురువారం.. ఇంప్రెసివ్ టీజర్..!

February 26, 2021


img

మ్యూజిక్ డైరక్టర్ కీరవాణి తనయుడు సింహా హీరోగా చేస్తున్న రెండవ సినిమా తెల్లవారితే గురువారం. మత్తు వదలరా అంటూ వెరైటీ ప్రయత్నం చేసి ప్రేక్షకులను మెప్పించిన సింహా తన సెకండ్ ప్రయత్నంగా మరో డిఫరెంట్ కథతో వస్తున్నాడు. పెళ్లికి రెడీ అయిన అమ్మాయి.. అబ్బాయి.. ఇంతలో పెళ్లి ఇష్టం లేదని గోడ దూకి పారిపోవడం.. కట్ చేస్తే అతని లవ్ స్టోరీ.. ఇలా మంచి ఎంగేజింగ్ కథతో వస్తున్నట్టు ఉన్నారు. పొద్దున్నే పెళ్లనగా మాములుగా అయితే హీరోయిన్ పారిపోవడం చాలా సినిమాల్లో చూశాం కాని హీరో గోడ దూకి పారిపోవడం మాత్రం విచిత్రంగా ఉంది.  

వారాహి చలన చిత్ర బ్యానర్ లో మణికాంత్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో సింహాకు జోడీగా మిషా నారంగ్, చిత్ర షుక్లా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. కీరవాణి మరో తనయుడు కాళ భైరవ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. టీజర్ చాలా ఇంప్రెసివ్ అనిపించగా సినిమా కూడా ఇదే విధంగా ఉంటే సింహా ఖాతాలో మరో సూపర్ హిట్ పడినట్టే లెక్క. ఈ సినిమాను మార్చ్ 27న రిలీజ్ ఫిక్స్ చేశారు. 

Related Post

సినిమా స‌మీక్ష