సమంత 'శాకుంతలం'.. షూటింగ్ ఎప్పుడంటే..!

February 26, 2021


img

సౌత్ స్టార్ హీరోయిన్ సమంత పెళ్లి తర్వాత కూడా తన ఫాం ను కొనసాగిస్తుంది. సినిమాలే కాదు డిజిటల్ ఫ్లాట్ ఫాం మీద కూడా అదరగొడుతుంది సమంత. జాను తర్వాత ఏ సినిమా కమిట్ అవని సమంత గుణశేఖర్ డైరక్షన్ లో శాకుంతలంలో లీడ్ రోల్ చేస్తుంది. ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్ లో ప్లాన్ చేస్తున్నారు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసుకున్న శాకుంతలం సినిమా మార్చ్ 16 నుండి సెట్స్ మీదకు వెళ్తుందని తెలుస్తుంది. 

రుద్రమదేవి తర్వాత గుణశేఖర్ చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. గుణశేఖర్ సినిమా అంటేనే భారీ సెట్లు ఉంటాయి. శాకుంతలం సినిమాలో భారీ సెట్ ప్రాపర్టీ ఉంటుందని తెలుస్తుంది. సమంత కూడా ఈ సినిమా విషయంలో ఎక్సయిటింగ్ గా ఉందని అంటున్నారు. Related Post

సినిమా స‌మీక్ష