సుమంత్ 'దేశముదురు'..!

February 20, 2021


img

అక్కినేని ఫ్యామిలీ హీరో సుమంత్ ఇప్పుటికి కెరియర్ లో నిలదొక్కుకునే ప్రయత్నాల్లోనే ఉన్నారని చెప్పొచ్చు. ఆర్జీవి లాంటి డైరక్టర్ తో సినిమా చేసినా సరే సుమంత్ కు లక్ కలిసి రాలేదు. కొన్నాళ్లుగా కెరియర్ లో సక్సెస్ లు లేక వెనకపడ్డ సుమంత్ మళ్లీ రావా సినిమాతో మెప్పించాడు. ఈ సినిమా తర్వాత మళ్లీ ఫ్లాపులు చేస్తున్న సుమంత్ కటపదారి అంటూ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కన్నడ సినిమాకు రీమేక్ గా వచ్చిన కపటదారి జస్ట్ ఓకే అనేలా ఉందని తెలుస్తుంది.

ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో దేశముదురు సినిమా విశేషాలను చెప్పుకొచ్చారు సుమంత్. అదేంటి సుమంత్ కు.. పూరీ డైరక్షన్ లో అల్లు అర్జున్ చేసిన దేశముదురుకి కనెక్షన్ ఏంటని అనుకోవచ్చు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే.. అల్లు అర్జున్ దేశముదురు సినిమాను పూరీ ముందు సుమంత్ తో చేయాలని అనుకున్నాడట. మాస్ యాక్షన్ రొమాన్స్ అన్ని అదిరిపోయే రేంజ్ లో ఉండే దేశముదురు కథ నచ్చినా సుమంత్ ఆ టైం లో చేయలేనని చెప్పాడట. అయితే రిజల్ట్ హిట్ అవడంతో తను చేసి ఉంటే సినిమా ఫ్లాప్ అయ్యేదని చెబుతున్నారు సుమంత్.

అల్లు అర్జున్ కాబట్టి అలా ఆడింది.. ఒకవేళ సుమంత్ చేసి ఉంటే కెరియర్ గాడిలో పడేదేమో.. కాని సుమంత్ మాత్రం ఆ కథను వద్దనేశాడట. సో అలా దేశముదురు సినిమాతో సుమంత్ ఓ మంచి ఛాన్స్ మిస్ అయ్యాడని చెప్పొచ్చు.Related Post

సినిమా స‌మీక్ష