నానితో నాగ చైతన్య ఢీ..!

January 25, 2021


img

నాచురల్ స్టార్ నాని, అక్కినేని నాగ చైతన్య ఇద్దరు తమ సినిమాలతో పోటీ పడుతున్నారు. కరోనా లాక్ డౌన్ వల్ల లాస్ట్ ఇయర్ 9 నెలలు రిలీజ్ ప్లాన్ చేసిన సినిమాలన్ని వరుసగా రిలీజ్ అవుతున్నాయి. సంక్రాంతికి నాలుగు సినిమాలు రిలీజ్ అవగా జనవరి నెల చివర్లో కూడా రెండు సినిమాలు వస్తున్నాయి. ఇక ఫిబ్రవరిలో కూడా వారానికి రెండు సినిమాలు రిలీజ్ ప్లాన్ చేశారు. మార్చ్ నెలలో కూడా అదే రేంజ్ లో రిలీజ్ లు ఉన్నాయి. ఈ రెండు మూడు నెలలు యువ హీరోల క్రేజీ సినిమాలు రిలీజ్ అవనున్నాయి.

ఇక ఉగాదికి మాత్రం ముందే రిలీజ్ కన్ ఫాం చేసుకుంటున్నారు. ఇప్పటికే నాని టక్ జగదీష్ ఉగాది రిలీజ్ ఫిక్స్ చేసుకోగా ఇప్పుడు నాగ చైతన్య కూడా ఉగాదికే లవ్ స్టోరీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. నాని టక్ జగదీష్ శివ నిర్వాణ డైరక్షన్ లో వస్తుంది. ఆల్రెడీ నానితో నిన్ను కోరి హిట్ కొట్టిన శివ నిర్వాణ ఆ తర్వాత నాగ చైతన్యతో మజిలీ అంటూ హిట్ అందుకున్నాడు. అతని డైరక్షన్ లో మూడవ సినిమాగా.. నానితో రెండవ సినిమాగా టక్ జగదీష్ పై భారీ అంచనాలు ఉన్నాయి.

ఫిదా తర్వాత శేఖర్ కమ్ముల చేస్తున్న సినిమా లవ్ స్టోరీ. నాగ చైతన్య, సాయి పల్లవి జోడీగా నటిస్తున్న లవ్ స్టోరీపై కూడా చాలా అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా సాయి పల్లావితో ఫిదా లాంటి సినిమా చేసిన శేఖర్ కమ్ముల ఈ సినిమాలో ఆమెను ఎలా చూపించాడు అనే క్రేజ్ తో సినిమాపై సూపర్ బజ్ ఏర్పడింది. మరి ఈ రెండు సినిమాలు ఉగాది ఫైట్ లో నిలుస్తుండగా వీటిలో ఏది విజయ పతాకం ఎగురవేస్తుందో చూడాలి.Related Post

సినిమా స‌మీక్ష