నాగ శౌర్య పోలీసు వారి హెచ్చరిక

January 21, 2021


img

యువ హీరో నాగ శౌర్య సెట్స్ మీద రెండు సినిమాలు ఉండగా మరో సినిమాను షురూ చేశాడు. రాజేంద్ర డైరక్షన్ లో నాగ శౌర్య హీరోగా వస్తున్న సినిమా పోలీస్ వారి హెచ్చరిక. ఇప్పటికే సౌజన్య డైరక్షన్ లో వరుడు కావలెను సినిమా చేస్తున్న నాగ శౌర్య ఆ తర్వాత సంతోష్ జాగర్లమూడి డైరక్షన్ లో లక్ష్య సినిమా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత పోలీస్ వారి హెచ్చరిక సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమాలో నాగ శౌర్య పోలీస్ గా నటిస్తాడని తెలుస్తుంది. రాజేంద్ర డైరక్షన్ లో ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ లో ఈ సినిమాను మహేష్ ఎస్ కోనేరు నిర్మిస్తున్నారు. యువ హీరోల్లో తన ప్రతిభ చాటుతున్న నాగ శౌర్య కొత్త కథలతో వస్తున్నాడు. మరి ఈ సినిమాల్లో ఏది అతనికి మంచి ఫలితాలు అందిస్తుందో చూడాలి. కొత్త కథ మొదలైంది.. ఒక అమేజింగ్ ఎక్స్ పీరియన్స్ అంటూ నాగ శౌర్య పోలీసు వారి హెచ్చరిక గురించి ట్వీట్ చేశాడు.  

Related Post

సినిమా స‌మీక్ష