ప్రదీప్ సినిమా ట్రైలర్ రిలీజ్..!

January 21, 2021


img

యాంకర్ ప్రదీప్ హీరోగా మున్నా డైరక్షన్ లో వస్తున్న సినిమా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా..? లాస్ట్ ఇయర్ మార్చ్ లోనే రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా ఈ నెల 29న రిలీజ్ ప్లాన్ చేశారు. ప్రదీప్ సరసన అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ట్రైలర్ రీసెంట్ గా రిలీజైంది. ట్రైలర్ విషయానికి వస్తే రెండు జన్మలు.. ఒక ప్రేమ కథ కాన్సెప్ట్ తో ఈ సినిమా వస్తుందని అనిపిస్తుంది. ప్రదీప్, అమృత అయ్యర్ ప్రెసెంట్ డేస్ లో కాలేజ్ లో కలుసుకోవడం.. వారి గత జన్మలో ప్రేమలో పడటం లాంటి ఇంట్రెస్టింగ్ కథతో సినిమా వస్తుంది. 

సినిమా ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. యాంకర్ ప్రదీ ఇమేజ్ కు తగినట్టుగా తొలిసారి హీరోగా చేస్తూనే మంచి కంటెంట్ ఉన్న కథతో వస్తున్నాడని అనిపిస్తుంది. బుల్లితెర మీద మేల్ యంకర్స్ లో టాప్ ప్లేస్ లో ఉన్న ప్రదీప్ మాచిరాజు హీరోగా మొదటి ప్రయత్నంలో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి. ఆల్రెడీ రెడ్ సినిమాతో హిట్ అందుకున్న అమృత అయ్యర్ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుంది.

Related Post

సినిమా స‌మీక్ష