వారసురాలి బాధ్యత తీసుకున్న దిల్ రాజు

May 22, 2020


img

స్టార్ ప్రొడ్యూసర్ కమ్ డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు ప్రస్తుతం బోని కపూర్ తో కలిసి పింక్ తెలుగు రీమేక్ వకీల్ సాబ్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తుండగా వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా టైం లో బోని కపూర్ తో దిల్ రాజుకు మంచి రిలేషన్ ఏర్పడిందట. అందుకే శ్రీదేవి వారసురాలు జాన్వీ కపూర్ బాధ్యతని అతని చేతుల్లో పెడుతున్నాడట. 

త్వరలో దిల్ రాజు చేయబోయే ఒక క్రేజీ ప్రాజెక్ట్ కు జాన్వీనే హీరోయిన్ గా తీసుకోవాలని అనుకుంటున్నారట. రెమ్యునరేషన్ కూడా భారీగానే ఇస్తున్నట్టు తెలుస్తుంది. అయితే కేవలం ఒక సినిమా మాత్రమే కాదు ఏకంగా మూడు సినిమాలు అగ్రిమెంట్ చేసుకునేలా ప్లాన్ చేస్తున్నారట. జాన్వీ తో దిల్ రాజు కరెక్ట్ సినిమా పడితే మాత్రం తెలుగులో శ్రీదేవి లానే ఆమె కూడా క్రేజ్ తెచ్చుకునే ఛాన్స్ ఉంది. జాన్వీ తొలి తెలుగు సినిమా ఏది అవుతుంది.. అమ్మడు ఏ స్టార్ హీరో పక్కన నటిస్తుంది అన్నది త్వరలో తెలుస్తుంది. Related Post

సినిమా స‌మీక్ష