డ్రగ్స్ తీసుకోము: ఇంటర్ విద్యార్ధులకు కొత్త షరతు

May 12, 2026


img

నేటి నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కాలేజీలలో ఇంటర్ ప్రధమ విద్యార్ధులు ప్రవేశాలు ప్రారంభం అయ్యాయి. ఈ మేరకు ఇంటర్ బోర్డ్ కార్యదర్శి అభిలాష అభినవ్ సోమవారం షెడ్యూల్ జారీ చేశారు.

అయితే ఈసారి ఇంటర్లో చేరే విద్యార్ధులకు బోర్డు కొత్త షరతు విధించింది. దరఖాస్తుతో పాటు ‘మాదక ద్రవ్యాలు వినియోగించబోము. వాటి సరఫరా, విక్రయాల్లో పాల్గొనమని అఫిడవిట్ సమర్పించాల్సి ఉంటుంది. దానిపై విద్యార్ధులతో పాటు వారి తల్లితండ్రులు కూడా సంతకాలు చేయాల్సి ఉంటుంది. అఫిడవిట్ సమర్పించకపోతే దరఖాస్తు తిరస్కరించబడుతుంది. దరఖాస్తుతో పాటు తప్పనిసరిగా విద్యార్ధుల ఆధార్ కార్డ్ కాపీ కూడా సమర్పించాల్సి ఉంటుంది. 

పదో తరగతి వరకు సాగే పాఠశాల విద్యలో ఇంటర్ విలీనం చేసి ఒకటో తరగతి నుంచి 12వ క్లాసు వరకు ఒకే బోర్డు అధ్వర్యంలో తరగతులు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం భావించింది. కానీ ఆవిధంగా చేయాలంటే ముందుగా అనేక మార్పులు చేర్పులు చేయాల్సి ఉంటుంది.

ముఖ్యంగా ప్రభుత్వపరంగా విద్యావ్యవస్థలో కొన్ని సాంకేతిక అంశాలు సవరణ చేయాల్సి ఉంటుంది. కనుక ఇప్పటికిప్పుడు ఈ నూతన విధానం అమలుచేస్తే కొత్త సమస్యలు పుట్టుకొచ్చే ప్రమాదం ఉంది. పైగా ప్రవేశాలు ఆలస్యం అవుతాయి. 

కనుక పాఠశాల, ఇంటర్ విద్యావ్యవస్థల విలీనంపై మరింత లోతుగా అధ్యయనం చేసి, శాసనసభలో చర్చించి అందరి అభిప్రాయలు, సలహాలు తీసుకున్న తర్వాత దీనిని అమలుచేయాలని సిఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. కనుక ఈ ఏడాది పాత పద్దతిలోనే ఇంటర్ ప్రధమ ప్రవేశాలు జరుగుతాయి.


Related Post