ఈ నెల 23, 29 తేదీలలో పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికలు రెండు దశలలో జరుగబోతున్నాయి. ఈసారి ఎలాగైనా ఈ ఎన్నికలలో గెలిచి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో తొలిసారిగా అధికారం చేజిక్కించుకోవాలని బిజేపి చాలా పట్టుదలగా ఉంది. కనుక ఎన్నికల మ్యానిఫెస్టోలో వారాల వాన కురిపించేసింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నేడు బిజేపిఎన్నికల మ్యానిఫెస్టోని విడుదల చేశారు. దానిలో
1. నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భ్రుతి నెలకు రూ.3,000
2. మహిళలకు నెలకు రూ.3,000 పించన్
3. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్స్.
4. బిజేపి అధికారంలోకి వస్తే ఉద్యోగులకు 7వ వేతన సంఘం అమలు.
5. మహిళల కోసం ప్రత్యేక పోలీస్ బెటాలియన్లు ఏర్పాటు.
6. ఐదేళ్ళలో బెంగాల్ యువతకు కోటి ఉద్యోగాలు కల్పన, స్వయం ఉపాధి అవకాశాలు పెంపుకి చర్యలు.
7. గోవుల అక్రమ రవాణాపై కటిన చర్యలు.
8. బంగ్లాదేశ్, పాకిస్తాన్ నుంచి చొరబాట్లకు అడ్డుకట్ట వేస్తాం.
బిజేపి ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇంకా పలుహామీలున్నాయి. వీటితో బెంగాలీలను మెప్పించగలదా? ఎన్నికలలో గెలిచి అధికారంలోకి రాగలదా లేదా? అనేది మే 4న ఓట్లు లెక్కించి ఫలితాలు వెలువడితే తెలుస్తుంది.